
జనం న్యూస్ 21-11-2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రతిభ మోడల్ హైస్కూల్‌కు ఘనత దక్కింది. ఈ విద్యాసంస్థలోని ఇద్దరు విద్యార్థులు సంగారెడ్డి జిల్లా స్థాయిలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ,, నీదా పర్వీన్ ,, డాటర్ ఆఫ్ వహీద్ ,, సోఫియా మహేక్ , షఫీ ఉద్దీన్ ,,, జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన లో విద్యార్థులు మొదటి స్థానం సాధించి స్కూల్‌కు పేరు ప్రతిష్టలను తీసుకువచ్చారు. విద్యార్థుల అసాధారణ ప్రతిభ, కృషి, పట్టుదలతో వచ్చిన ఈ విజయంపై స్కూల్ ప్రిన్సిపాల్ కీర్తి కుమార్ వైఫ్ ఆఫ్ చంద్రకళ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సన్మానిస్తూ పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. ప్రతిభా విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ స్కూల్ గురువులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలు, నిబద్ధత, క్రమశిక్షణ, శ్రద్ధతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విజయం ప్రతిభ మోడల్ హైస్కూల్‌కు ఒక కొత్త మైలురాయిగా నిలిచింది.

