
జనం న్యూస్ నవంబర్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శ్రీశ్రీశ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో ఈ రోజున బహుళ పోలి పాడ్యమీ బహుళసందర్భంగా స్వామివారికి ప్రాత:కాలంలో పుణ్యవచనం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారని, అనంతరం అన్న సమారాధనను జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ భీమర భీమరశెట్టి రాంకీ ప్రారంభించారని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలియజేశారు. అంతకుముందు దేవస్థానమునకు రాంకీ కు సాదరంగా ఆహ్వానించి దేవస్థాన కమిటీ సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి మురళికృష్ణ స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించిన అనంతరం చైర్మన్ సత్యనారాయణ రాంకీ కు శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా రాంకీ మాట్లాడుతూ రెగ్యులర్ ట్రస్ట్ బోర్డ్ వచ్చింది కనుక దేవస్థానం అభివృద్ధికి అవసరమైన విషయాలను బోర్డు సభ్యులు సమావేశo లో తీర్మానాలు చేసి శాసనసభ్యులు మమ కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకురావాలని రాంకీ సూచించారని సత్యనారాయణ తెలిపారు. చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ భారీ అన్న సమారాధనకు చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణ ప్రముఖులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు స్వామివారి భక్తులు స్వామివారి సహకారంతో 5000 మందికి ఇతోదికంగా సహకారం అందించారని, అన్న సమారాధన కార్యక్రమంలో శ్రీవారు సేన అధ్యక్షురాలు కుమారి దాడి రాజేశ్వరి వారి సభ్యులు శ్రీవారి సేవా సమితి సభ్యులు భక్తులకు ఆహారం అందించే విషయంలో సహకరించారని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మద్దాల నారాయణరావు ఎలమంచిలి బంగారు రాజు రాపేటి సంతోష్ కుమార్ పెంటకోటి గణేష్ శ్రీమతి దూలం సత్యవతి బాదంపూడి కొండమ్మ తదితరులు పాల్గొన్నారు.//