
వృద్ధగౌతమికి కుండలేశ్వరంలో గంగాహారతి ఇస్తున్న దృశ్యం
కాట్రేనికోన, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
పవిత్ర కుండలేశ్వరం వద్ద గోదావరిమాతకు గురువారం రాత్రి వైభవంగా పంచహారతి నిర్వహించారు. సాయంత్రం శ్రీపార్వతీకుండ లేశ్వరస్వామి, శ్రీరుక్మిణీసత్యభామసమేత వే ణుగోపాలస్వామి, శ్రీవల్లీదేవసేన సమేత సు బ్రహ్మణ్యేశ్వరస్వామి, కనకదుర్గ, ఆంజనేయ స్వామికి , పార్వతి కుండలేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు కాళ్ళ కూరి కామేశ్వరరావు ఆచార్యత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భక్తులు, గ్రా మస్థుల ఆధ్వర్యంలో పంచహారతి పుడకలతో మంగళవాయిద్యాల నడుమ బాణసంచా కా ల్పులతో ఊరేగింపుగా వృద్ధగౌతమీ నదీ తీరా నికి వెళ్లారు. తర్వాత సం ప్రదాయబ ద్ధంగా పంచహారతి నిర్వహించారు. నక్షత్ర, కుంభ, నాగ, బిల్వ, పంచహారతి నిర్వహించా రు. గంగుమళ్ల నిరంజనరావు ముఖ్యఅతిథిగా ఎ మ్మెల్సీ రాజశేఖర్ తో పాటు పలువురికి సన్మా నాలు చేశారు. కార్యక్రమంలో దాట్ల పవన్, త్సవటపల్లి నాగేంద్ర, త్సవటపల్లి శ్రీను, పీఎ స్ఎన్ రాజు, నడింపల్లి సుబ్బరాజు, చెల్లి సురే ష్, ఆకాశం శ్రీను, గంగుమళ్ల రవి శంకరకు మార్, గోకర కొండ సత్యనారాయణ, వంగ దుర్గ బాబు వి రవి వర్మ తదిత రులు పాల్గొన్నారు

