జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
స్పార్క్ రాష్ట్ర ఓపెన్ చెస్ట్ టోర్నమెంట్ కర్నూలు జిల్లాలోని సంసిద్ పాఠశాల సంతోష్ నగర్ లో ఈ నెల 2వతేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు కీర్తి రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుల వెంకట కోటయ్య ఈ చెస్ పోటీలో పాల్గొంటున్న ఇద్దరూ విద్యార్థులకు రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. పట్టణంలోని వైయస్సార్ కాలనీ నందు శనివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట కోటయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి ఆలోచనలు క్రీడా పోటీల్లో పాల్గొంటేనే వారిలో ఉన్న సత్తా ఏంటో వారికితెలుస్తుందన్నారు. అటువంటి విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించటమువలన చురుగ్గా ఆడ గలుగుతారన్నారు. మునుముందు పేద విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు పోలిశెట్టి (రాము)రామారావు నేలం యేసు రాజు, కొర్నెపాటి నాగరాజు తోపాటు పలువురు పాల్గొన్నారు.