
జనం న్యూస్ : నవంబర్ 22 శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :వై.రమేష్ ;
సిద్ధిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో స్వపరిపాలన దినోత్సవము శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. స్వపరిపాలన లో భాగంగా డి.ఈ.ఓ గా, రఘు వర్ధన్ రెడ్డి,ప్రిన్సిపాల్ గా ఆశిష్,కరస్పాండెంట్ గా తన్వి,ఉపాధ్యాయులుగా మణికంఠ,చరణ్య,వ్రిo ద,వర్షిణి,నితీష్,శివసాయి,హర్షవర్థన్,శ్రీసాయి హర్ష, సాయి తేజ,వర్ధన్,రిషి ,కృతిక్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి కరస్పాండెంట్ లిఖిత ,సవ్వడి మ్యూజిక్ డైరెక్టర్ వి.వి కన్న,ఉపాధ్యాయినిలు వాణి శ్రీ,రత్నమాల, దేవికా,కావేరి,భరతమాత,అరుణ,మనుష తదితరులు పాల్గొన్నారు.