
జనంన్యూస్. 22 సిరికొండ.
టేకేదార్ లను పావులుగా వాడుకొని కార్మికులపై బెదింపులకు పూనుకోవడం చట్టవ్యతిరేకం.
దేశాయి బ్రదర్స్ యాజమాన్యం కవ్వింపు చర్యలు మానుకొని సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించాలని, టేకేదార్ లను పావులుగా వాడుకొని కార్మికులపై బెదింపులకు పూనుకోవడం చట్టవ్యతిరేకం అని.తెలంగాణ ప్రగతిశీల భీడివర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆర్. రమేష్ అన్నారు.శనివారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు: కార్మికులను ఆర్థికంగా దోచుకోవడమే పనిగా పెట్టుకున్న దేశాయి యాజమాన్యం చట్ట వ్యతిరేకంగా, కనీస వేతనాల చట్టం ఉల్లంగించి ఆర్థికంగా నిలువు దోపిడీకి పాల్పడుతు కార్మికులను మోసం చేస్తున్నారన్నారు. పలుదాపాలుగా తెలంగాణ ప్రగతిశీల భీడివర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పోరాడుతుంటే కొంతమంది టేకేదార్ లను తమ ఎజెంట్స్ గా మార్చుకొని కార్మికులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తమకు అనుకూలంగా తెల్లపేపర్ పై సంతకాలు చేయాలని లేకపోతే తొలగిస్తాం అని బెదిరిస్తున్నారన్నారు. దేశాయి బ్రదర్స్ చట్టవ్యతిరేక చర్యలను చట్టభద్ధంగా ఎదుర్కోంటాం అన్నారు. యాజమాన్యం తమ పిల్లచేష్టలు మని సమస్య పరిష్కారం అయ్యేవిధంగా చూడాలి అన్నారు. కార్మికులను దేశయి బ్రదర్స్ చెస్తున్న ఆర్థిక దోపిడీ మానుకోవాలి అని, పితారా పేరుతో బలవంతంగా కార్మికులకు అంట గడుతున్న నాసిరకం తినుబండరాలను ఆపివేయాలని, వేయి బీడీలకు సరిపోయే నాణ్యమైన ఆకు, తంబాకు, దారం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల భీడివర్కర్స్ యూనియన్ జిల్లా, మండల నాయకులు అనిస్, లావణ్య, మణెమ్మ, లత, రాగవి, శ్రావంతి తదితరులు పాల్గొన్నారు.