
జనం న్యూస్ ఆగస్టు 22 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం వ్యవసాయ అధికారులు పలు సూచనలు తెలియజేశారు
పంటను కోసిన తరువాత వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమికి నష్టం కల్గుతుందని ఏ డి ఏ పుణ్యవతి మేడం రైతులకి వివరించారు .శనివారం గౌతపుర్ గ్రామంలొ పొలాలను సందర్శించి రైతులకి వరి కోతలు అయిన వెంటనే వరి కోయ్యలను కల్చకుండ వాటిని పొలంలోనే కలియ దున్నడం వలన రైతులకి ,భూమికి మరింత లాభం జర్గుతుందని వివరించారు .భూమికి మేలు చేసే వానపాములు ,సూక్ష్మ జీవులు చనిపోయి నష్టం కల్గుతుందని ,భూమి పై పొరలో ఉండే సేంద్రియo తగ్గిపోయి పంట దిగుబడి సైతం తగ్గిపోయే ప్రమాదముందని ,భూమి లో ఉండే సారం తగ్గిపోయి చౌడు భుమిగా మరే అవకాశం ఉంటుందన్నారు .దీని వల్ల వాయు కాలుష్యం మరియు శ్వాసకోశ వ్యాధులకి కారణమయ్యే హానికరమైన కాలుష్య కారకాలను విడుదల చేయడం ,నత్రజని భాస్వరం మరియు పొటాషియం వంటి విలువైన నెల పోషకాలు నాశనం చేయడం జర్గుతుందన్నరు కాల్చడం ద్వారా నెల నీటి నిలుపుదల మెరుగుపడే సేంద్రియ పదార్థం తొలగిపోతుందని అన్నారు.వరి కోయ్యలను కాల్చడం బదులు వరి పంట కోసిన తర్వాత పొలానికి నీలు పారించి ఎకరాకు 150 కిలోల సింగిల్ సూపర్ పోస్ఫేటే వేసి ,15 రోజుల తరువాత కలియ దున్నలన్నరు .కలియ దున్నడం వలన వరి గడ్డి అంత కుళ్లిపోయి సేంద్రియ కర్బానం స్థాయి పెరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో ఏ ఓ రాజశేఖర్ గౌడ్ గారు ఏ ఈ ఓ కృష్ణవేణి ,రైతులు శేకర్ ,రంకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు