
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 22
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తర్లుపాడు నందు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన అంబవరం నేతాజీ రెడ్డి పదవీ విరమణ కానుకగా పాఠశాల కార్యాలయానికి కావలసిన ప్రింటర్ మరియు స్కానర్ ను బహుకరించారు. గతంలో వజ్రోత్సవ వేడుకల సందర్భంగా 2000 లీటర్ల మంచినీటి ట్యాంకును బహుకరించారు. ప్రస్తుతం భౌతిక శాస్త్ర ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నంద్యాల నాగేశ్వరరావు పబ్లిక్ అడ్రస్ సిస్టం పోర్టబుల్ మైక్ ను పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు ఎస్ఎంసి చైర్మన్ శ్రీ వెన్న రాజారాం రెడ్డి ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ దాతలను ఘనంగా సత్కరించారు.