
గంజాయి, మత్తు పదార్థాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై విజయనగరం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు.
మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రారంభించిన “అభ్యుదయం సైకిల్ యాత్ర” విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాధ్ జట్టీ ఐ.పి.ఎస్ ఆదేశాలతో, విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ఉత్తర్వులతో ఈ రోజు విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలో విశేష స్పందనతో కొనసాగింది. ఈ రోజు సైకిల్ ర్యాలిను ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి ఎస్.కోట ఆకుల డిపో వద్ద జండా ఊపి ప్రారంభించారు. అక్కడ విద్యార్ధులు, యువతతో ఏర్పాటు చేసిన 1972 ఆకారం మరియు సంకల్ప రధం ప్రత్యెక ఆకర్షణగా నిలిచాయి. అక్కడ నుండి అభ్యుదయం సైకిల్ ర్యాలి కోలాటాలు, బల్ల వేషాలు, వాయిద్యాలు, డిజెల నడుమ ఎన్ సి సి విద్యార్ధులతో కలిసి దేవి బొమ్మ జంక్షన్ వద్దకు చేరుకుంది. దేవి బొమ్మ జంక్షన్ వద్ద వివేకానంద కళాశాల విధ్యార్ధులతో గంజాయి మరియు మాదక ద్రవ్యాల పై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ళ లలిత కుమారి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ళ లలిత కుమారి మాటలాడుతూ – ఈ అభ్యుదయం సైకిల్ యాత్రను విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ ప్రారభించడం గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం చేపడుతున్న ఈ అభ్యుదయం సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని జిల్లా ప్రజలందరినీ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా యువతను మత్తు పదార్థాల నుండి రక్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు విద్యాసంస్థలను మత్తు రహిత ప్రాంతాలుగా మార్చడం అవసరం అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా విశాఖపట్నం రేంజ్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారన్నారు. యువత దేశ భవిష్యత్తు. కుతూహలం, ఒత్తిడి, స్నేహితుల ప్రభావం వంటి కారణాలతో మత్తు పదార్థాలకు దగ్గరవకుండా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసారు. మత్తు పదార్థాల వినియోగం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. తల్లితండ్రులు పిల్లల ప్రవర్తన, పరిచయాలు, ఒత్తిడి పరిస్థితులపై క్రమం తప్పకుండా దృష్టి పెట్టాలన్నారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం వంటి అక్రమ చర్యల్లో పాల్గొనే వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం అక్కడ ఉండే వారితో డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు గంజాయి మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1972కు, 100/112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు.తదుపరి ఈ అభ్యుదయం సైకిల్ ర్యాలి భవాని నగర్, బోడ్డవర జంక్షన్, కిన్తలపాలెం మీదుగా యువత, విద్యార్ధులకు మత్తు పదార్ధాల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిపిస్తు తాటిపూడి వద్ద గంట్యాడ మండలంలోకి ప్రవేశించింది.విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ రావు మరియు రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ గార్లు గంట్యాడ మండలంలోకి ప్రవేశించిన సైకిల్ ర్యాలికు ఘనంగా స్వాగతం పలికారు. తాటిపూడి ఎ.పి. మోడల్ స్కూల్ విదార్దులతో కలిసి సైకిల్ ర్యాలి కొండతామరాపల్లి జంక్షన్ కు చేరుకొని అక్కడ గంజాయి పై యాంటి డ్రగ్స్ స్లొగన్స్తో అవగాహన కార్యక్రమం చేపట్టి కర పత్రాలు పంచిపెట్టారు. తదుపరి సైకిల్ ర్యాలి కొర్లం, లక్కిడం మీదుగా నరవ గ్రామం చేరుకొని అక్కడ మానవహారం చేపట్టి మత్తు పదార్ధాలకు యువత దూరంగా ఉండాలని నినాదాలు చేసారు. తదుపరి రామవరం మీదుగా యాంటి డ్రగ్స్ స్లొగన్స్తో, అక్కడక్కడ కర పత్రాలు పంచుకుంటూ విజయనగరం పట్టణం పరిధిలోకి అభ్యుదయం సైకిల్ యాత్ర ప్రవేశించింది.అనంతరం విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ట్రాఫిక్ సిఐ సి.హెచ్.సురినాయుడు మరియు ఎస్ఐలు ఈ అభ్యుదయం సైకిల్ యాత్రను అయ్యన్నపేట జంక్షన్ వద్ద పూలను జల్లి విజయనగరం పట్టణంలోకి విద్యార్ధులు మరియు గ్రామస్తులతో ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి విజయనగరం నుండి అభ్యుదయం సైకిల్ ర్యాలీ ప్రారంభం కానున్దన్నారు.ఈ రోజు ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్.కోట పోలీస్ స్టేషన్ సిఐ వి.యెన్. మూర్తి, విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ రావు, విజయనగరం 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ట్రాఫిక్ సిఐ సి.హెచ్.సురినాయుడు మరియు ఎస్ఐలు, వివిధ ప్రైవేటు మరియు గవర్నమెంటు పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాధ్ జట్టీ ఐ.పి.ఎస్ సందేశం -మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది, ముఖ్యంగా విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డి.ఐ.జి) శ్రీ గోపీనాథ్ జెట్టి,ఐ.పి.ఎస్. అన్నారు.మాదకద్రవ్యాలు కుటుంబాలు సమాజం యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి.వాటి నిర్మూలన పోలీసుల పని మాత్రమే కాదు ప్రతి పౌరుడు యొక్క బాధ్యత.పోలీసులతోపాటు సమాజం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు కలసి పనిచేస్తే గంజాయి వంటి మాదకద్రవ్యాలకు మన సమాజంలో చోటుండదని పేర్కొన్నారు.యువత దీనికి ఆకర్షితులు కాకుండా చూడటం డ్రగ్ మాఫియా నుండి యువతను రక్షించటం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
యువతకు ముఖ్యంగా విద్యార్థి దశలోనే వీటిపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ అవగాహనలో భాగంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలోసంకల్పం మిషన్, కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమం లో భాగంగా ఇప్పటివరకు విశాఖపట్నం రేంజ్ పరిధిలో మొత్తం 19,740 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఈ కార్యక్రమములో 11,58,870 మంది హాజరయ్యారు, 14,452 గ్రామాలు/పట్టణాలలో ఈ సంకల్పం కార్యక్రమాలు జరిగాయి . 5,326 విద్యా సంస్థలు లో సంకల్పం కార్యక్రమం జరగగా 4,58,096 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 1,46,367 కరపత్రాలు పంపిణీ చేసి, ముఖ్యమైన ప్రాంతాలు, విద్యా సంస్థలు వద్ద 388 డ్రాప్ బాక్సులు చేసి, 4,094 ఈగల్ క్లబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగినది. విశాఖపట్నం రేంజ్ డీఐజీ.