
జనం న్యూస్ నవంబర్ 23 సంగారెడ్డి జిల్లా
గుమ్మడిదల గ్రామంలో కోమల్ హెయిర్ స్టైల్ నూతన హెయిర్ స్టైల్ షాప్ను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు అమ్మగారి సదానంద రెడ్డి, గ్రామ ప్రముఖులు ప్రకాశ్ రెడ్డి, మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు పెరగడానికి ఇలాంటి వ్యాపారాలు దోహదపడతాయని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా హెయిర్ స్టైల్ యజమానులు సిద్దు, తేజ లను అభినందించారు.