
బిచ్కుంద నవంబర్ 24 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాగంగా చిన్న దడిగి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు పిసిసి డెలికేట్ విట్టల్ రెడ్డి పంపిణీ చేశారు.జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల అనుసారంగా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షునితోపాటు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రవి పటేల్, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, గంగారం సంతోష్ గౌడ్ , శివాజీ తుకారాం గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

