
జనం న్యూస్ నవంబర్ 24( కొత్తగూడెం నియోజకవర్గ )
భద్రాది కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్తగా నియమితులైన అధ్యక్షురాలు దేవి ప్రసన్నను స్థానిక బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీసీ సంఘానికి చెందిన పలువురు ప్రముఖులు, గ్రామస్థాయి నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సన్మాన కార్యక్రమంలో బీసీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ “జిల్లాలో సామాజిక న్యాయం, కార్యకర్తల అంతస్థు పెంపు, బీసీ సమాజ అభివృద్ధి కోసం దేవి ప్రసన్న నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాం” అని చెప్పారు.దేవి ప్రసన్న మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధి, గ్రామస్థాయి సమస్యల పరిష్కారం, యువతకు అవకాశాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు ప్రసాద్, మాదా శ్రీనివాసులు, ఇతర స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.