
జనం న్యూస్ 24 నవంబర్ వికారాబాద్ జిల్లా
స్వేరోస్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ దివాస్ సందర్భంగా ఆదివారం రోజు పరిగి పట్టణ కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాయ్స్ హాస్టల్ లో 2k రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతిజ్ఞ దివస్ వారోత్సవాలు నవంబర్ 17న ప్రారంభమై నవంబర్ 23 రోజున ముగింపు ఉంటుందని, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన సందర్భంగా ప్రతిజ్ఞ దివస్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పే బ్యాక్ టు సొసైటీ లో భాగంగా గురుకులాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ద్వారా ఏర్పడిన స్వేరోస్ నెట్వర్క్ లో అక్షరం ఆరోగ్యం ఆర్థికం మరియు ఆత్మగౌరవం తో స్వేరోస్ ముందుండాలని టెన్ కమాండ్ మెంట్ లుఏర్పాటు చేసి మహనీయుల ఆశయ సాధనలో భాగంగా మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలు యువత చదువు ఆరోగ్యం ఆర్థికం గా ఎదగాలని వారికి మహనీయుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నా స్వప్నం నా లక్ష్యం అన్నట్టుగా ప్రతి అంశంలో ముందంజలో ఉంటూ సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగిస్తూ సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతూ ఎదగాలని అలాగే దేశ అభివృద్ధికి పాటుపడాలని భవిష్యత్ తరాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని, స్వేరోస్ కృషి చేస్తున్నది, ప్రతిజ్ఞ దివస్ సందర్భంగా ఆదివారం స్వేరోస్ ఫౌండర్ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు నా ఏదో ఒక ప్రతిజ్ఞ అది సమాజంలో మంచికి మారుపేరుగా ఉండేటట్టు ప్రతి ఒక్క స్వేరో ప్రతిజ్ఞ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మొదటగా ఉదయం రన్ తో స్టార్ట్ చేసి దినచర్యను ప్రారంభిస్తారు. కావున ఈరోజు ప్రతిజ్ఞ దివస్ సందర్భంగా టూకే రన్ నిర్వహించడం జరిగింది. ఈ పరుగు పందెం వల్ల యువత విద్యార్థి లో సృజనాత్మకత శారీరక దారుఢ్యం పెంపొందుతూ రోజంతా యాక్టివ్ మూడ్‌లో ఉండడానికి పని చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రన్ తో లేదా వాకింగ్‌తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ పరుగు పందెంలో మొదటి స్థానంలో శివనాయక్ రెండవ స్థానంలో గణేష్ మూడవ స్థానంలో కార్తీక్ లు విజేతలుగా నిలిచారు అనంతరం జిహెచ్ఎం అంజయ్య చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతి అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజేష్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ నరేందర్,జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ వెంకటప్రసాద్,సుధాకర్,జిల్లా జాయింట్ సెక్రటరీ నర్సింలు,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రావణ్ కుమార్,సభ్యులు కృష్ణ,ఉపాధ్యాయులు భీమయ్య, వెంకటయ్య చెన్నయ్య, శ్రీనివాస్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.