
జనం న్యూస్ 25నవంబర్ పెగడపల్లి
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకుఈరోజు పెగడపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం వద్ద చీరల పంపిణీ ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణలో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ సంఘాల అభివృద్ధి కోసం మండల సమైక్యలకు బస్సు సర్వీసులు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా సోలార్ ప్రాజెక్టులు పెట్టించడం మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ చేయడం పెట్రోలు బంకుల నిర్వహణకు ప్రోత్సహించడం ఇందిరా క్రాంతి పేరుతో హోటల్లు నడిపించే విధంగా ప్రోత్సహించడం ఎన్నో విధాలుగా మహిళలను మహారాణులను చేయాలని లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఆనంద్ కుమార్, ఎంపీడీవో ప్రేమ్ సాగర్ రావు ఐకెపి ఎపిఎం రవి వర్మ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఐకెపి సీసీలు వీఎవోలు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వోరగల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు చాట్ల విజయభాస్కర్ బండారి శ్రీనివాస్ కడారి తిరుపతి ఐలేని వంశీధర్ రావు ఇస్లావత్ రవి నాయక్ మందపల్లి అంజయ్య ముదిగంటి పవన్ రెడ్డి బాలసాని శ్రీనివాస్ ముంజ మహిపాల్ గౌడ్ మల్యాల ఎల్లయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు.