
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 24
తర్లుపాడు మండలంలోని అన్ని రైతు సేవ కేంద్రాల పరిధిలో గల గ్రామాలలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు వారి ఆదేశాల ప్రకారం రైతన్న మీకోసం క్లస్టర్ క్యాంపెయిన్ మొదలైందని మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి తెలియజేశారు. ఈ క్యాంపైన్లలో రానున్న ఐదు సంవత్సరాలలో రైతును రాజును చేసేందుకు ఐదు విధానాలతో కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు సేవ కేంద్రం పరిధిలో గ్రామ వ్యవసాయ సహాయకులు టీం లీడర్ మరియు పశుసంవర్ధక శాఖ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ ఇంజనీరింగ్ సహాయకులు, గ్రామ ఎనర్జీ సహాయకులు, నాచురల్ ఫార్మింగ్ సిబ్బంది, అభ్యుదయ రైతులు, మరియు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ, నేటి వినియోగదారుల అసోసియేషన్, మరియు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ సిబ్బంది టీముగా పాల్గొని గ్రామాలలో క్లస్టర్ వారీగా క్యాంపైన్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రైతులు సుస్థిర వ్యవసాయం చేపట్టడానికి అవసరమైన పంచ సూత్రాలను ఈ టీం సభ్యులు వివరిస్తారు. ఈ క్యాంపై 24 నుండి 29 నవంబర్ వరకు జరుగుతుందని తెలియజేశారు. రైతుకు అనుబంధ శాఖల అయిన అధికారులు వారి గృహాలను సందర్శించినప్పుడు రైతుల విన్నపములను మరియు సలహాలను ఈ టీం సభ్యులు సేకరిస్తారు. ఏపీ ఏ ఐ ఎం ఎస్ అప్లికేషన్ నందు రైతుల వివరాలు నమోదు చేస్తారు. రైతులతో ఏపీ ఎయిమ్స్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేయించుకోవడం జరుగుతుంది. రైతుకు అవసరమైన సమాచారం అంతయు ఆ యాప్ ద్వారా పొందగలరు. కావున తరలుపాడు మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునే దిశగా సహకరించాలని మండల వ్యవసాయ అధికారి వారు కోరారు. తదుపరి తర్లుపాడు గ్రామంలో జరుగుతున్న రైతన్న మీకోసం క్యాంపైను సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్ గారితో మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షించారు. కార్యక్రమములో ఏఈఓ దేవేంద్ర గౌడ్ వి ఏ సావిత్రి నాచురల్ ఫార్మింగ్ సిబ్బంది వెంకటనారాయణ రెడ్డి రామ సుబ్బులు క్లస్టర్ లోని రైతులు పాల్గొన్నారు.
