
ప్రభుత్వ హాస్టల్స్ అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి – కలెక్టర్ పి. ప్రావీణ్య
విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగాలి…
నాణ్యమైన వసతులపై కలెక్టర్ దృష్టి
జనం న్యూస్ నవంబర్ 25 సంగారెడ్డి జిల్లాలోని
బీసీ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ హాస్టల్స్‌ను మరింత మెరుగుపర్చడంలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని బీసీ అభివృద్ధి కార్యాలయం ఆధ్వర్యంలో సంగారెడ్డి బీసీ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం సంగారెడ్డి పట్టణం లోని బాలురవసతిగృహం విద్యార్థులకు , హాస్టల్ గడ్డ బీసీ బాలికల వసతి గృహం విద్యార్థులకు కిర్బీ సంస్థ, సి.ఎస్.ఆర్. నిధుల ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, స్కూల్ బ్యాగులు, ట్రంక్ బాక్సులను, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య,అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి విద్యార్థులకు అందజేశారు. జిల్లా లోని 34 బిసి హాస్టల్ విద్యార్థులకు కిర్బీ సంస్థ సిఎస్ఆర్ నిధులు 29.89 లక్షల రూ. ద్వారా అందించిన స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు (3102), గ్లాసులు (3102), స్కూల్ బ్యాగులు (1681), ట్రంక్ బాక్సులు (1681) వంటి వస్తువులను జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. వసతి గృహాల విద్యార్థుల కోసం నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అయితే సమాజం, సంస్థలు బాధ్యతగా ముందుకు వస్తే విద్యార్థుల భవిష్యత్తు మరింత బలోపేతం అవుతుంది అని తెలిపారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణంలో కావడం కోసమే కార్పొరేట్ సంస్థల సహకారంతో ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు శాత శాతం ఉత్తీర్ణమి సాధించాలని, మంచి మార్కులు విద్యార్థులు సాధిస్తే మరోసారి వచ్చే విద్యార్థులకు ఘనంగా సన్మానించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ప్రావిణ్య ప్రసంగం విద్యార్థుల్లో ఉత్తేజం నింపింది. అనంతరం హాస్టల్ విద్యార్థులతో కలిసి ,వారి మధ్య కూర్చొని వాళ్లతో పాటు అల్పాహారం తీసుకున్నారు. వారి వసతి, భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా విద్యార్థిలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భముగా బి సి సంక్షేమాధికారి జగదీశ్ మాట్లాడుతూ ... సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు కిర్బీ సంస్థ ద్వారా సిఎస్ఆర్ నిధులతో పంపిణీ చేసిన ఉపకరణాలు , విద్యా సౌకర్యాలకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ అభివృద్ధిలో భాగంగా ముందుకు వచ్చిన కిర్బీ సంస్థకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో కిర్బీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రాజ మహేంద్ర , హెచ్ ఆర్ నాగరాజు , వార్డెన్ గౌసుద్దీన్, సంబంధిత శాఖల అధికారులు , ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .