
జనం న్యూస్ నవంబర్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులనే వాడాలని, విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోవాలని బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి సూర్యనారాయణ గుప్త ( నానాజీ) పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.మంగళవారం కాట్రేనికోన మండలం పరిధిలోని వేట్లపాలెం మొండి పోర తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు, గుత్తిల భైరవమూర్తి పాల్గొన్నారు.

