
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 25
తర్లుపాడు మండలం లో సూరేపల్లి, తుమ్మలచెరువు మరియు కలుజువలపాడు గ్రామాలలో రైతన్న మీకోసం సిబ్బంది చేస్తున్న సర్వే ను సమర్ధవంతంగా నిర్వహించాలని మండల తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి మాట్లాడుతూ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా ఏపీ ఏఐఎంఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.ఈ క్రాప్ లో నమోదైన ప్రతి రైతు ఏపీ ఏఐఎంఎస్ సర్వే మరియు వ్యవసాయ యాంత్రీకరణ సర్వే లో నమోదు చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది త్వరితగతిన ప్రతి రైతు సమగ్ర సమాచారాన్ని పొందుపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది జిలానీ, మల్లికార్జున, సుస్మిత, శ్వేత, మేరీమని , ఏఈఓ దేవేంద్ర, రైతులు పాల్గొన్నారు.
