
జనం న్యూస్ నవంబర్ 25:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని తడ్పాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మంగళవారం రోజునా వ్యాయామ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశిష్ట సేవలు అందిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్ ఘనంగా సన్మానించారు.పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు గైని గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆటల్లో నైపుణ్యం వంటి విలువలను అభివృద్ధి చేస్తూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో విద్యార్థులను తయారు చేసి నిలబెట్టడంలో పి డి ఆనంద్ చేసిన కృషి ప్రశంసనీయమైనది అని విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చూపుతున్న అంకితభావం, పట్టుదల, ఉదాహరణగా నిలుస్తుందనీ మాట్లాడారు. సన్మానం పొందిన ఉపాధ్యాయుడు పీడీ ఆనంద్ మాట్లాడుతూ
వ్యాయామ విద్య పితామహుడిగా పేరొందిన హ్యారీ బక్ జయంతి సందర్భంగా ఈరోజు జరుపుకునే వ్యాయామ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో నన్ను సన్మానించిన మీ ప్రేమ, గౌరవం, ప్రోత్సాహం నా కర్తవ్యబద్ధతను మరింత పెంచాయి,ఈ సన్మానం నాకు ఎంతో గొప్ప ప్రేరణగా నిలుస్తుందనీ తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాములు, రవి, స్వప్న, నవీన్,దేవానంద్ గౌడ్ చక్రపాణి, విజయ, కృష్ణప్రసాద్ పాల్గొనడం జరిగింది.