
బిచ్కుంద నవంబర్ 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి జడ్పి సి ఇ ఓ. చందర్ నాయక్, ఐ కె పి డి పి ఎంసాయిలు లు ముఖ్య అతిథిగా హాజరై జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు గాను 2 కోట్ల 76 లక్షల రూపాయల వడ్డీలేని రుణ రాయితీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకొని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తూ కోటేశ్వర్లుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి అవసరమైన రుణాలు తీసుకుంటూ వాణిజ్య, వ్యాపార రంగాల్లో సైతం మహిళను అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. మహిళా సంఘాలు ఆర్థిక వృద్ధిని సాధించేందుకు వీలుగా మహిళలకు పెట్రోల్ పంపులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు,బస్సులను కొనుగోలు చేసి ఆర్ టి సి కి అద్దెకు ఇచ్చేందుకు, మహిళా శక్తి క్యాంటీన్ లను, సోయా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం మహిళ సంఘాలకు కేటాయించి రాష్ట్రంలోని కోటి మహిళలకు కోటేశ్వర్లుగా చెయ్యాలన్న లక్ష్యం తో ప్రభుత్వం వడ్డి లేని రాయితీ రుణాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటేశ్వరులను చేయాలనే మహోన్నత లక్ష్యం తో పని చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళా సభ్యులకు ఇందిర మహిళా శక్తి పేరుతో చీరలను పంపిణీ చెయ్యడం జరుగుతుందనీ అన్నారు. కార్యక్రమం లో పి సి సి డెలిగేట్ విట్టల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కె. శంకర్, మున్సిపల్ కమిషనర్ హయు0,రమేష్ దేశాయ్, గోపాల్ రెడ్డి, యూత్ జిల్లా ప్రెసిడెంట్ యోగేష్, వెంకట్ రెడ్డి, ఎ పి ఎం గంగారాం, రవీందర్, జగదీష్, ప్రసన్న రాణి, ఎం పి డి ఓ గోపాల్ లతోపాటు మహిళా సంఘాల సభ్యులు, ఐ కె పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

