
జనం న్యూస్ 26 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, అయిజ పట్టణ బీజేపీ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో, రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్. రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఆయన కార్యకర్తలతో కలిసి భారత రాజ్యాంగ ఉపోద్ఘాతం చదివి వినిపిస్తూ, రాజ్యాంగం యొక్క మహత్తును, ప్రతి పౌరుడు పాటించాల్సిన కర్తవ్యాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,“మన దేశ ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందేలా రూపొందించబడిన భారత రాజ్యాంగం, ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. 1949 నవంబర్ 26న ఆమోదించబడిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి గర్వకారణం,” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదన్న, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడికొండ భీమ్ సెన్ రావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు ప్రదీప్ కుమార్, వెంకటేష్ యాదవ్, అయిజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, వీరయ్యాచారి, లక్ష్మణాచారి, కుర్వ భీమన్న, గోపాల్, భాస్కరయ్య, సుధాకర్, రఘు తదితరులు పాల్గొన్నారు.