
జనం న్యూస్ నవంబర్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్ పల్లి వివేకానంద నగర్లోని అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజాభిషేకాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామి స్వయంగా పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు చేసి దేవుని ఆశీస్సులు అందుకున్నారు. సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం భక్తులకు శౌర్యం, విజయం, ఆరోగ్యం ప్రసాదించే పవిత్రమైన రోజు అని భక్తులు భగవంతుని ఆశీర్వాదాలతో సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని స్వామివారినీ ప్రార్థించారు.