
బిచ్కుంద నవంబర్ 26 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ తెలంగాణ రాష్ట్ర యువజన నాయకుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీమ గంగారం పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ సమానత్వం, సౌబ్రాతృత్వం ఆదేశాల రూపొందించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికి మూల స్తంభం, 1949 నవంబర్ 26న ఆమోదించబడిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి గర్వకారణం, భారత రాజ్యాంగం ఒక పత్రం కాదు, ఇది దేశానికి పునాది లాంటిది ,ప్రభుత్వం యొక్క నిర్మాణం అధికారులు మరియు పౌరుల యొక్క హక్కులు విధులన్నింటిని నిర్దేశిస్తుందని ఆయన అన్నారు ,.ఈ కార్యక్రమంలో అధ్యక్షుని తో పాటు కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్, నౌషా నాయక్ హనుమంతరావు దేశాయ్ చింతల్ హనుమాన్లు , మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ ,ఉత్తమ్ , శంకర్, అశోక్ మైనారిటీ నాయకుడు కలీం , కాజా పాషా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ,