
జనం న్యూస్ 27 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ ప్రతినిధులు జిల్లాకు బుధవారం చేరుకున్నారు. కమిటీ ఛైర్మన్ వి.జోగేశ్వరరావు, సభ్యులు డాక్టర్ పి.వి.వి. సూర్యనారాయణ రాజుకు అధికారులు ముందుగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం రామనారాయణ క్షేత్రాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. రేపు శ్రీ పైడితల్లమ్మ దర్శనం అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.