
జనం న్యూస్ నవంబర్ 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ, హైదరాబాద్ వారిచే ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాలను, దివ్యాంగులకు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత మే నెలలో ముమ్మిడివరం నియోజకవర్గం వారీగా మందికి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన 832 రకాల ఉపకరణములను నేడు అందించారన్నారు. అలాగే నియోజకవర్గం పరిధిలో మిగిలిన వారికి కూడా తదుపరి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమగు ఉపకరణాలను అందించేందుకు కృషి చేస్తామని ఎంపీ హరీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే చెల్లు వివేకనంద, ముమ్మిడివరం మార్కెట్ చైర్మన్ భాగ్యశ్రీ , గొల్ల కోటి వెంకటరెడ్డి చెల్లు అశోక్,నాగిడి నాగేశ్వరరావు , నడుంపల్లి సుబ్బరాజు ,నూకల మూర్తి, కూటమ నాయకులు తదితరులు
