
సర్పంచ్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లగొని విక్రమ్ గౌడ్ నామినేషన్
జనం న్యూస్ నవంబర్ 27
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్న నేపథ్యంలో, నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎల్లగొని విక్రమ్ గౌడ్ సర్పంచ్ పదవికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఎన్నికల నిబంధనలు, విధి విధానాల ప్రకారం అన్ని పత్రాలను సమర్పించిన విక్రమ్ గౌడ్‌కు గ్రామస్థులు, కాంగ్రెస్ నేతలు, భారీగా హాజరై మద్దతు తెలిపారు. గ్రామాభివృద్ధి, పారదర్శక పరిపాలన లక్ష్యంగా తనను అవకాశమిస్తే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని విక్రమ్ గౌడ్ ఈ సందర్భంలో తెలిపారు.నందిగామలో సర్పంచ్ పదవికి పోటీ మరింత హోరెత్తే అవకాశం ఉన్నట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.