
(జనం న్యూస్ 27 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం గ్రామ ప్రజలకుసర్పంచ్ అభ్యర్థిగా నా మేనిఫెస్టో – ప్రజలకు నా సేవలు1. గ్రామంలోని రామాలయం కోసం 1 ఎకరం భూమి విరాళంగా ఇస్తాను.2. నేను అధికారం లో ఉన్న ఐదు సంవత్సరాలు ఇంటి పన్ను నేనే చెల్లిస్తాను.3. ఐదు సంవత్సరాలు నల్లా బిల్లులు నేనే కట్టుతాను.. 4. ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచిత మందులు పంపిణీ.5. గ్రామంలోని ప్రతి దేవాలయానికి ప్రతి సంవత్సరం ₹50,000 ఉత్సవాల కోసం.6. వినాయక చవితి సందర్భంగా అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలు ఉచితం.7. గ్రామంలోని మసీదు, చర్చి లకు ప్రతి సంవత్సరం ₹50,000 ప్రార్థనల కోసం.8. ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 15, జనవరి 26 కార్యక్రమాలకు పోటీల బహుమతులు నేను అందిస్తాను.9. బాగా చదివే విద్యార్థులకు ప్రతి తరగతి నుండి ఇద్దరికి ప్రతి సంవత్సరం ₹2,000 స్కాలర్షిప్.10. ప్రతి సంవత్సరం ఇతర గ్రామాల్లో చదివే 10 మంది విద్యార్థులకు సైకిళ్లు ఉచితం.11. సంక్రాంతి పండుగకు మగ్గుల పోటీ బహుమతులకు ₹5,000.12. అయ్యప్ప మాలధారులకు నిత్య అన్నదానం.13. దసరా సందర్భంగా 100 మంది పేదలకు బట్టల పంపిణీ.14. ఎంపిక చేసిన 10 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు ఉచితం.15. గ్రామంలో స్వంత ఖర్చులతో గ్రంథాలయం నిర్వహణ.16. స్వంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికి ఉచిత మినరల్ వాటర్ సరఫరా.17. పెళ్లిళ్లు, జాతరలకు డీజే, మైక్ ఉచితం.18. మరణించిన వారికి శవ భద్రపరిచేందుకు ఫ్రీజర్ ఉచితం.19. స్మశానానికి వైకుంఠ రథం ఏర్పాటు.20. పేద కుటుంబాల్లో ఆడపిల్ల వివాహానికి చీర–సారే కానుక.21. వికలాంగులకు ఉచిత ట్రైసైకిళ్లు. ఈ మేనిఫెస్టో కు గ్రామ ప్రజలు అందరూ అంగీకరిస్తారని భావిస్తున్నాను. మీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామ అభివృద్ధిలో నన్ను భాగస్వాములు చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నా నా వినమ్ర నమస్సుమాంజలులు........ ఇట్లు మీ శ్రేయోభిలాషి