
: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి*పెద్ద అడిశర్లపల్లి,
నవంబర్ 26(ఆంధ్రప్రభ)
పీఏ పల్లి మండలం గణపురం స్టేజి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు గుడిపల్లి ఎస్సై నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా గుడిపల్లి ఎస్సై నరసింహులు మాట్లాడుతూ మంగళవారం రాత్రి సుమారు 11 గంటల 30 నిమిషాల సమయంలో మతిస్థిమితం లేని 50 సంవత్సరాల మహిళ గణపురం స్టేజి సమీపంలో 167 జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం డ్రైవర్ అతివేగం గా అజాగ్రత్తగా వాహనం నడిపి టక్కరిచ్చి వెళ్లిపోయాడని మతిస్థిమితం లేని మహిళలకు తీవ్రత స్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందిందని అన్నారు. గణపురం పంచాయతీ కార్యదర్శి గోన వేణు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి పరిశోదిస్తామని తెలిపారు. వివరాలు తెలిసినవారు గుడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ నరసింహులు 8712670227 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.