
. గ్రామపంచాయితీ నామినేషన్లపై సూచనలు
జనం న్యూస్ నవంబర్ 27 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
గ్రామపంచాయితీ ఎన్నికల నామినేషన్ల నేపధ్యంలో మండలంలోని కేశవాపూర్ క్లస్టర్‌ను గురువారం రోజున సీపీ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా, శాంతిభద్రతల మధ్య జరుగేందుకు సంబంధించిన కీలక సూచనలు ఆయన అధికారులకు అందించారు. ఈ సందర్భంగా
సీపీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత పకడ్బందీగా ఉండాలని సూచించారు
ఎన్నికల నియమాలను కచ్చితంగా అమలు చేయాలని అభ్యర్థులు మరియు ప్రజలు ఎలాంటి ఒత్తిడులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి వివాదాలు, అశాంతి వాతావరణం నెలకొనకుండా పోలీసు బందోబస్తు పెంచాలని కోరారు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన హితవు పలికారు ఈ కార్యక్రమంలో డిసిపి దార కవిత కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి సీఐ పులి రమేష్ ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అక్కినపల్లి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు