
బహుజనుల రాజ్యాధికారానికి పూలే సిద్ధాంతమే మార్గం: బీఎస్పీ నాయకులు కురిమెల్ల శంకర్
జనం న్యూస్ 28నవంబర్ ( నియోజకవర్గ కొత్తగూడె నియోజకవర్గంలోని స్థానిక బీసీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ
వర్ధంతి కార్యక్రమాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ కురిమెల్ల శంకర్ మాట్లాడుతూ 18వ శతాబ్దంలోనే అణగారిన వర్గాల విద్య, సామాజిక న్యాయం కోసం పోరాడి భారత చరిత్రకు కొత్త దారితీశిన మహోన్నతుడే మహాత్మ జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పూలే కలలుగన్న సమానత్వ సమాజమే నిజమైన బహుజన రాజ్యమని, ఆ సిద్ధాంతాల మీదనే మాన్యూవర్ కాన్షిరాం స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ పునాదులు నిలిచాయని తెలిపారు.శంకర్ మాట్లాడుతూ “పూలే చూపిన మార్గం, ఆయన విప్లవాత్మక ఆలోచనలు ఈ దేశంలో అణగారిన వర్గాల సాధికారతకు బలమైన ఆయుధాలు. పూలే కలలుగన్న బహుజన రాజ్యం నిజం కావాలంటే బహుజన సమాజ్ పార్టీ బలోపేతం కావాలి” అని అద్దేవా పెట్టారు.కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కోడుమూరు సత్యనారాయణ, వైస్ చైర్మన్ కౌడగాని శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు అంకినీడి ప్రసాద్, మాదా శ్రీరాములు, మిట్టపల్లి సాంబయ్య, బిక్షపతి, మహేష్, చారి తదితరులు పాల్గొన్నారు.అందరూ కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
