
జనం న్యూస్ నవంబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
విద్యతో బడుగు బలహీన వర్గాల ప్రజల్లో మహాత్మ జ్యోతిరావు పూలే వెలుగులు నింపాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు పూలే వర్ధంతిని మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ విద్య సమానత్వం న్యాయం నేటి సమాజ నిర్మాణానికి మార్గదర్శకం అని విద్యా వెలుగులతోనే ప్రతి ఒక్కరికిసామాజిక సమానత్వం అందుతుందని నమ్మిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే.. ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లల చదువు కోసం అనేక సౌకర్యాలు పాఠశాలలో కల్పిస్తుందనీ అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోలేపల్లి శ్రీనివాసరెడ్డి ఆబ్బు ప్రకాశ్ రెడ్డి చిట్టి రెడ్డి రాజిరెడ్డి చిందం రవి తదితరులు పాల్గొన్నారు….