
జనం న్యూస్ నవంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆర్పీకే ల ద్వారా అమ్మకం చేసి సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పెసరీస్ సొసైటీ మాజీ అధ్యక్షులు నాగిడి నాగేశ్వరరావు కోరారు. శుక్రవారం కాట్రేనికోన రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు సకాలంలో సొమ్ములు చెల్లించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కాట్రేనికోన సొసైటీ చైర్ పర్సన్ పెసంగి రంగారావు వర్మ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేట్ డైరెక్ట్ కంకటాల రాము సొసైటీ సభ్యులు చేకూరి వెంకట కృష్ణంరాజు, మోకా అప్పాజీ, మాజీ అధ్యక్షులు శీలం సూర్యనారాయణ, సీఈవోవిత్తనాల మూర్తి,రైతులు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.