
నవంబర్ 30 (జనంన్యూస్)
రాష్ట్రస్థాయిలో జరగనున్న కబడి సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో మెదక్ జిల్లా నుండి 28 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కబడి అసోసియేషన్ కార్యదర్శి రమేష్ వెల్లడించారు. ఇందులో భాగంగా మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆదివారం అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించారు , ఇందులోబాలికల విభాగం నుండి 70 మంది, బాలుర విభాగం నుండి 75 మంది పోటీల్లో పాల్గొనగా, 14 మంది చొప్పున రెండు విభాగాలలో కలిపి 28 మంది రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆయన వివరించారు. బాయ్స్ విభాగం క్రీడాకారులు మహబూబ్నగర్లో జరిగే కబడ్డీ స్టేట్మెంట్లో పాల్గొంటారని, గర్ల్స్ విభాగం వారు రెండవ తేదీ నుండి నల్గొండలో జరిగే స్టేట్మెంట్లో మెదక్ జిల్లా నుండి పాల్గొంటారని ఆయన వివరించారు. ఈ ఎంపికలో అసోసేషన్ సభ్యులు గోపాల్, శ్రీకాంత్,రవి , శేషు ప్రశాంత్,ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.