
జనం న్యూస్ డిసెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పై భారీ వ్యయo 17 నెలల్లో ₹ 50,763 కోట్లు రూపాయలు ఖర్చు చేశారని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు. డిసెంబర్ నెల ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం 82 వ వార్డు పూడిమడక రోడ్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వేదుల సూరి ప్రభ, బొడ్డేడ దేవయ్య, షేక్ ఖాదర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగ జగదీష్ పాల్గొని వృద్ధులకు మహిళలకు వికలాంగులకు 4000, 6000 లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి నాగ జగదీష్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ పథకం అమలు చేయడం లేదని ఒక్క కూటమి ప్రభుత్వంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీన అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మల్ల గణేష్ జామి రాజు గైపూర్ త్రిమూర్తులు కింతాడ సర్వేశ్వరరావు గండిబోయి శంకర్ తదితరులు పాల్గొన్నారు.//