జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేపిహెచ్బి డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మరియు స్మశాన వాటికలను పరిశీలించారు.ముందుగా ఎన్.ఆర్.ఎస్.ఎ కాలనీలో పార్కును పరిశీలించి వాలీబాల్ కోర్టుగా అభివృద్ధి చేయాలని ..అనంతరం భగత్ సింగ్ నగర్. ఎన్ ఆర్ ఎస్ ఏ కాలనీ లింక్ రోడ్డు అభివృద్ధి పరచాలని ఆదేశాలు జారీ చేశారు.. డైమండ్ ఎస్టేట్స్ లోని ఓపెన్ ప్లేస్ ఫ్లోరింగ్ పూర్తి చేసి దానీ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి బోర్వెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.. అనంతరం..ఎడవ వ ఫేస్ లోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలను పరిశీలించారు .ఇందులో భాగంగా ముస్లిం స్మశాన వాటికలో ముఖ ద్వార నిర్మాణం చేసి మౌలిక సదుపాయాలుకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.అలాగే హిందూ.క్రిస్టియన్ గ్రేవియర్డ్ లలో కాంపౌండ్ వాల్ మరియు టాయ్లెట్ లు ఏర్పాటు చేయాలని పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో స్మశాన వాటికలు, పార్కుల అభివృద్ధి కొరకు పనులు ప్రారంభించామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని కూడా ఆపేసి ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా చేస్తున్నారని అయినా కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని.. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి.నాయకులు సాయి బాబు చౌదరి,వెంకట రెడ్డి,పవన్,రాజేష్ రాయ్,పాతూరి గోపి,ప్రతాప్, పి ఎల్ ప్రసాద్,పంచ గంగేశ్వర్,సూర్య నారాయణ,మహిళా నాయకులు భవాని,భారతి, చంద్రకాంతమ్మ,యునస్, అధికారులు.డి ఈ శంకర్..ఎఈ సాయి ప్రసాద్. వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి..తదితరులు పాల్గొన్నారు..