జనం న్యూస్ ఫిబ్రవరి 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో సోమవారం రోజునా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో తెలంగాణ తల్లి స్థూపం వద్దటీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు….కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.తర్వాత జిల్లా కాంగ్రెస్ డిసిసి ఉపాధ్యక్షుడు శివాన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రక్కన యున్న రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించి రాష్ట్ర ప్రజలకు న్యాయం చెయ్యాలని,వివక్ష చూడటం తగదని అన్నారు. ఇట్టి కార్యక్రమములో ఏర్గట్లగ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రెండ్ల రాజారెడ్డి, బద్దం లింగారెడ్డి, కూరాకుల బొర్రన్న, పాకాల ప్రసాద్ గౌడ్, నాగేంద్ర కాలనీ జాకీర్, మదస్తూ చిన్న గంగారాం, దొబ్బల చిన్న లక్ష్మణ్, ఓర్స్ రాములు, జంగాల పెద్దోళ్ల శ్రీను, కంచరి రవి, మునిమాణిక్యం అజయ్, ఎస్ కె. మదర్, ఎస్ కె మహిబూబ్, రేండ్ల చిన్నయ్య, తుపాకుల సుదర్శన్ గౌడ్, అన్నెల మురళీగౌడ్, జంగాల సూర్యం, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.