
జనం న్యూస్ డిసెంబర్ 3, వికారాబాద్ జిల్లా
పుడూరు మండలంలోని తుర్క ఎంకేపల్లి, పుడుగుర్తి గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ మాజీ ఎంపీపీ మల్లేశం, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోప్పుల మహేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గంగారం హనుమంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మొత్తం 50 మంది బి ఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారికి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.