
.జనం న్యూస్ డిసెంబర్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్
రెడ్డికె పి హెచ్ బి కాలనీ ముడవ ఫేస్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాధమిక ఉప కేంద్రంని కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసైనికుల తో కలిసి సందర్శించి హెల్త్ అసిస్టెంట్ , సిబ్బంది మరియు పిల్లల టీకాలు వేయించుటకు వచ్చిన తల్లితండ్రులు తో మాటలాడి పరిస్థితిని తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రేమకుమార్ మాట్లాడుతూ కె.పి.హెచ్.బి కాలనీ లో గల ఏకైక చంటి పిల్లలకు టీకాలు వేసే హాస్పిటల్ పరిసరాలు చెత్త ,దోమలుతో కూడి అపరిశుభ్రంగా ఉందని, తల్లితండ్రులు కూర్చవటాని కుర్చీలు , షెడ్ లేవని, అధికంగా గల సిబ్బంది, అధికం గా వచ్చే తల్లితండ్రులకు కనీససం టాయిలేట్ సౌకర్యాలు కూడ లేకపోవడం వలన ఇబందులు పడుతున్నారని, హాస్పిటల్ వునచోట బోర్డ్ కూడా పెట్టని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని , సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్, సలాది శంకర్,దాసరి వెంకట్, సుంకర సాయి, బావిశెట్టి గోపి, బండారి రమేష్, పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
