
(జనం న్యూస్3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం
:భవిత కేంద్రం నందు దివ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి దివ్యంగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం నందు ముందుగా పిల్లలను రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఈ సమావేశం ను ఉద్దేశించి మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలు భవిత కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు.భవిత కేంద్రం నందు ప్రత్యేక ఉపాధ్యాయులుగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు అని ఈ భవిత కేంద్రం నందు దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక విద్యాబోధన తో పాటు ఫిజియోథెరపీ క్యాంప్ లు ,తల్లి తండ్రుల అవగాహన కార్యక్రమాలు ,ఇంటి వద్ద విద్యా కార్యక్రమాలు ,గ్రహణ మొర్రి,గ్రహణ శూల ఆపరేషన్ లు,అవసరమయిన ఉపకరణాలు అందించడం జరుగుతుంది అని మండల విద్యాధికారి తెలిపారు.అదే విధంగా మండల ప్రత్యేక ఉపాధ్యాయులు సమ్మయ్య గారు మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు స్కాలర్ షిప్ లు,ట్రాన్స్పోర్ట్ అలోవెన్స్, పాఠశాలకు తల్లి తండ్రుల సహకారం తో వచ్చి పిల్లలకు ఎస్కార్ట్ అలోవెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.మీటింగ్ అనంతరం దివ్యాంగ పిల్లలకు,తల్లి తండ్రులకు భోజన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం నందు ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగ పిల్లలు, తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు ,MIS కో ఆర్డినేటర్ సునీల్ ,మండల CCO ఇంతియాజ్, మండల CRP సాగర్ పాల్గొన్నారు.