
జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ
జిల్లాఅమలాపురం,3/12/2025. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప్పలగుప్తం మండలం సీనియర్ పాత్రికేయులు..రెడ్డి బాబు విషయం తెలుసుకున్న బహుజన సమాజ్ పార్టీ ( బి.ఎస్.పి )అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొలమూరు మోహన్ బాబు, మరియు సరిపల్లి సర్పంచ్ గెడ్డం సురేష్ బాబు ఆసుపత్రిని సందర్శించి సీనియర్ పాత్రికేయులు రెడ్డి బాబు ని పరామర్శించి ఆయన తొందరగా కోలుకోవాలని, వేడుకుంటూ.. ఆయనకు ధైర్యం చెప్పారు. వీరు వెంట జల్లి రామ దుర్గాప్రసాద్ సవరపు మీరా సాహెబ్ తదితరులు ఉన్నారు.
