
జనం న్యూస్ ; డిసెంబర్ 3 బుధవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్
;సిద్దిపేట జిల్లా పేర్ల వినోద్ కుమార్ శ్రావ్య కుమార్తె పేర్ల జైస్వి,యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-2025 నిర్వహిస్తున్న 50వ సబ్ జూనియర్, జూనియర్ నేషనల్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్-2025 (డిసెంబర్ 27–30, రాంచీ, ఝార్ఖండ్) లో పాల్గొనటానికి తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికైంది.రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పేర్ల జైస్వి, ఇప్పుడు జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించబోతుండటం సిద్దిపేట జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని కుటుంబ సభ్యులు పేర్ల ఆనంద్, సుజాత, పాషికంటి శ్రీనివాస్ ,అరుణ , శ్రవణ్, పేర్ల నవీన్ తెలిపారు.జైస్వి అభ్యాసంలో కీలకపాత్ర పోషించిన కోచ్ రాణమేడం, అలాగే ప్రోత్సహించిన గురువులు, జెన్ నెక్స్ట్ పాఠశాల, మాదాపూర్, హైదరాబాద్ ప్రధానోపాధ్యాయులు శ్రీలత, జితేందర్ గార్లకి తల్లిదండ్రులు పేర్ల శ్రావ్య, వినోద్ కుమార్ లెక్చరర్ ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పేర్ల జైస్వి జాతీయస్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు.