
మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్తయ్య
జనం న్యూస్,డిసెంబర్ 03,కంగ్టి, సంగారెడ్డి జిల్లా
కంగ్టి మండల పరిధిలోని 33 గ్రామ పంచాయతీలకు గాను 9 క్లస్టర్లలో నామినేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ కంగ్టి మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులుగా 20 మంది నామినేషన్లు,బోర్గి గ్రామంలో ఒక వార్డ్ మెంబర్ నామినేషన్ వేసినట్లు ఎంపీడీవో తెలిపారు.కంగ్టి 2,తుర్కవాడగమ్ 2, భీమ్రా 1, తడ్కల్ 4, ఎంకెమూరి 2,జంమ్గి కే 4, పీఎం దామరగిద్ద 3, గాజులపాడ్ 2,తొమిది క్లస్టర్లలో 20 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. సర్పంచ్,వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం వరకు స్వీకరించబడుతుందని తెలిపారు.