
జనం న్యూస్ డిసెంబర్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి బగ్ అమీర్ శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం లో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ రావు కమిటీ సభ్యుల, ఆలయ ప్రధాన అర్చకులు రమణ శాస్త్రి వారి బృందం ఆధ్వర్యంలో లో దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి హోమం, అలంకరణ, హారతి, విశేష పంచామృతా అభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను తీసుకొని మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.