
జనం న్యూస్ డిసెంబర్ 4
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కీ.శే. శ్రీ కోణిజేటి రోశయ్య వారి 4 వ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కంచర్ల బాబి వారి ఆధ్వర్యంలో తాటిపాక సెంటర్లో గల శ్రీ కొణిజేటి రోశయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించుట జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల బాబి , ఉపాధ్యక్షులు పోశెట్టి సూరిబాబు , లక్కీంశెట్టి బాబులు , కాసు శ్రీనివాస్ , జిల్లా కోశాధికారి కంచర్ల కృష్ణ మోహన్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాటిపాక సెంటర్ నందు జిల్లా అధ్యక్షులు కంచర్ల బాబి ఆధ్వర్యంలో 250 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
