
జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేనికోన
మార్గశిర మాసం మూడవ శుక్రవారం జొన్నపొత్తుల అలంకరణలో కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ పురోహితులు ఆణివిళ్ళ ఫణికాంత్ శాస్త్రి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలను నిర్వహించారు,ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అధ్యక్షులు ఆణివిళ్ళ సాయిబాబా,రామకృష్ణ పరమహంస, పవన్,శ్రీకాంత్,వేదుల శ్రీను,తాతపుడి బుల్లి,చెరుకు బాపిరాజు,సంసాని పాండురంగా రావు,పలువురు మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.పూజ అనంతరం ఆలయం వద్ద కాజా దుర్గా ప్రసాద్ ధన సహాయంతో పులిహార ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయడం జరిగిందన్నారు మార్గశిర మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం వద్ద వివిధ దాతల సహాయ సహకారాలతో పులిహార ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయడం జరుగుతుందని ఆలయ. పురోహితులు పణికాంత్ తెలిపారు
