
(జనం న్యూస్ 5డిసెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండలoలోని నర్సింగాపూర్ గ్రామపంచాయతీ కి చెందిన పెద్దల రూపబాపు 20 సంవత్సరాల నుండి పార్టీలకు విధేయుడుగా ఉంటూ నర్సింగాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించి, ఈ ప్రాంత మంత్రి అయిన వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించానని అన్నారు. అదేవిధంగా గ్రామంలోని సామాజిక సేవ చేస్తూ గ్రామంలోని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు రేషన్ కార్డులు , అర్హులైన వారికి పెన్షన్లు ప్రజలు అనారోగ్య రీత్యా హాస్పిటల్ ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేసి వారికి ఆర్థిక ధనం మంజూరు చేయిస్తూ నిరంతర కృషితో ప్రజలకు చేరువగా ఉండి సేవలు అందించానని పెద్దల రూపబాపు అన్నారు. నేటికీ గ్రామంలో పలు సమస్యలపై అవగాహన ఉందని నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నర్సింగాపూర్, గ్రామానికి సర్పంచ్ ఎస్టి రిజర్వేషన్ అయినందున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా సేవలను గుర్తించి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించరని అన్నారు, అధిక మెజార్టీతో గెలిపిస్తే మన గ్రామపంచాయతీని మరింత అభివృద్ధి ధ్యేయంగా మీ ముందు ఉంచుతానని పెద్దల రూప బాపు అన్నారు