
. జుక్కల్ డిసెంబర్ 5 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్
మండల కేంద్రం మొత్తం శుక్రవారం నాడు ఉత్సాహంతో మార్మోగింది. బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఆత్మీయ ఆధ్వర్యంలో, జుక్కల్ సర్పంచ్ అభ్యర్థిగా వాసరే స్వప్న – రమేష్ నామినేషన్ దాఖలు ఘనంగా నిర్వహించడం జరిగింది.కార్యక్రమం ప్రారంభంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. ఆ తరువాత మత దుర్గ దేవి ఆలయం, హనుమాన్ మందిరం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అభ్యర్థి విజయాన్ని కోరుకున్నారు.తరువాత జుక్కల్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థిని ఆహ్వానించడమే కాక, పార్టీ శక్తిని మరోసారి చాటిచెప్పారు.తరువాత మండల కేంద్రంలో నామినేషన్ దాఖలు కార్యక్రమం పూర్తిచేయడంతో మొత్తం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అభివృద్ధి పట్ల నిబద్ధతతో, ప్రజల ఆశీర్వాదాలతో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ భారీ ర్యాలీ మరింత ఊపు నిచ్చింది.

