
రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్
మాజీ ఎంయంసి అంతిగారి సురేందర్
జనం న్యూస్ 06 డిసెంబర్ వికారాబాద్ జిల్లా
ప్రపంచ మేధావి, ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న వ్యక్తి భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి, స్ఫూర్తి ప్రదాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పరిగి లో స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అంతిగారి సురేందర్ మాట్లాడుతూ.. దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి అట్టడుగు వర్గంలో జన్మించి ఎన్నో కష్టాలను గురించి బడుగు బలహీన వర్గాల కు స్ఫూర్తి నింపిన స్ఫూర్తి ప్రదాత అని అన్నారు,ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి బహుజన వర్గాల కోసం సంక్షేమ హాస్టల్లో రిజర్వేషన్లు స్కాలర్షిప్స్ మహిళలకు హిందూ కోడ్ బిల్లు సాధించిపెట్టిన వ్యక్తి అని కొనియాడారు, సమ సమాజ నిర్మాణానికి మనుషుల మధ్య సోదర భావం స్వేచ్ఛ సమానత్వం కోరుకున్నటువంటి వ్యక్తి,రాజ్యాంగం ద్వారానే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలందరికీ కల్పించినటువంటి మహనీయుడు, స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన గొప్ప సమానత్వావాది, సామాజిక పరివర్తన మూర్తి రాజనీతిజ్ఞుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్ ఈ ఓ గోపాల్, GHM రూప్ సింగ్, TJAC నాయకులు నాగేశ్వర్, TMTF అధ్యక్షులు వెంకటయ్య, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శ్రావణ్ కుమార్, ఉపాధ్యాయులు బర్కత్ పల్లి నరేందర్, మంచన్పల్లి శ్రీనివాస్, ముత్తప్ప, వెంకటయ్య, నర్సింలు, శ్రీశైలం, హనుమంతు స్వేరోస్ నాయకులు నర్సింలు, కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.