
జనం న్యూస్ డిసెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, మహిళా పక్షపాతి,మొదటి భారత దేశంలో న్యాయశాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ ప్రపంచ మేధావి భారతదేశ దశ దిశ సూచించిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేశంలో ఈరోజు ఈ రిజర్వేషన్ల లబ్ధి పొందుతున్నారంటే రాజ్యాంగం యొక్క గొప్పతనం అని అలాగే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని పార్లమెంట్లో పోరాడి అందరికీ ఓటు హక్కు కల్పించారని ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పుడు సజీవంగానే ఉంటాయని యువత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు . అంబేద్కర్ గారికి నివాళులర్పించిన వారిలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర టిడిపి కార్యదర్శి గుత్తుల సాయి, చెల్లి అశోక్, తాడి నరసింహారావు,దొమ్మేటి రమణ కుమార్, కట్ట సత్తిబాబు, తాడి జానకిరామ్, చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, మిమ్మితి చిరంజీవి, యాళ్ల ఉదయ్, పిల్లి నాగరాజు,విల్ల వీరస్వామి నాయుడు, రెడ్డి సుబ్బారావు, గుబ్బల శంకర్ దాస్, కాకి మాణిక్యం, నిమ్మకాయల విషు, కాశి లాజర్, నీతి పూడి వంశీ, మెండి కమల, బొక్క రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, కుడిపూడి మల్లేశ్వరి, కొండేటి వెంకటలక్ష్మి, రాజా, దాట్ల బాబు, రెడ్డి శ్రీను, పాయసం చిన్ని, ఎస్ఎంఎస్ ప్రసాద్, బూరుగు కళ్యాణ్, కర్ర దుర్గాప్రసాద్, చప్పిడి ప్రసాద్, ఎనమదల సుబ్బారావు, సీలం పండు , బొక్క త్రిమూర్తులు, చింతపల్లి రాజు,మొదలగువారు నివాళులర్పించారు.