
జనం న్యూస్- డిసెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్69వ వర్ధంతిని పురస్కరించుకొని నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సామాజిక తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో సామాజిక న్యాయం, విద్య, ఉద్యోగ అవకాశం సమాన హక్కులు అందరికి చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, ఉంగరాల శ్రీనివాస్, జంగయ్య, రాజా ప్రసాద్ (వైన్స్), సాగర్ బాబు, గుంటి కోటేశ్వరరావు, రామ్మోహన్, ఆదాసు విక్రమ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి, బాలాజీ నాయక్, ఎర్రబోయిన సురేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ షేక్ ఖాసిం, మద్దాల భాను, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.